- ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు,
- జిల్లా తెరాస నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి
మహా వెలుగు కురవి/ మే 27 రిపోర్టర్ చల్ల వేణు ;మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామ సీనియర్ జర్నలిస్ట్ టీవీ9 ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ , రాజేశ్వర్, డి వై గిరి, తల్లి దొంతు చుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, మహబూబాద్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి,గ్రామ సర్పంచ్ పోరెడ్డి రాం రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు మట్ట చిన్న సైదుల్లు,నాయకులు బొడ మల్సూర్,కొల్లూరి రమేష్,మెంతుల తిరుమలు మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.