బీడీ కంపెనీని తొలగించాలని వినతిపత్రం అందచేత

మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ గోపాల కృష్ణ జన్నారం :31: బీడీ జనవాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న బీడీ కంపెనీ ని తొలగించాలని విబిఏ జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు తహశీల్దార్ కిషన్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని జన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో జనవాసాల మధ్య బీడీ కంపెనీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యం దెబ్బతింటుందని,కావున బీడీ కంపెనీ ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వినతిపత్రం అందచేసిన వారిలో మండల అధ్యక్షుడు అజయ్ కుమార్,రాగుల వెంకటేష్,తిరుపతి,శరత్ కుమార్, భూమయ్య,లింగేశ్వర్లు పాల్గొన్నారు.