- ప్రభుత్వ అధికారులను, కోర్టును ఆశ్రయించిన బాధితురాలు,
మహావెలుగు కురవి/జూన్ రిపోర్టర్ చల్ల వేణు 01:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ క్రీడ మైదానాల ఏర్పాటులో భాగంగా కురవి మండలం రాజోలు లో గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రారంభించారు, సర్వే నెంబర్ 713, 714 నందు రెండు ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిలో య1.02 గుంటల భూమిని స్థానిక తహసిల్దార్ క్రీడ స్థలానికి కేటాయించినట్లు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది.
ఆ భూమిలో మైదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేస్తూ, దాని పక్కనే ఉన్న 712/బి లో 0.12 గుంటలు,757/ఏ లో15 గుంటల భూమి మహిళ రైతు భస్వ స్వరూప పేరున ఉన్నభూమిలో ఉద్దేశపూర్వకముగా గ్రామ క్రీడా మైదాన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని స్థానిక తహసీల్దార్ య 1.02 గుంటలు ప్రభుత్వ భూమి ని రాసి ఇవ్వగా దానిలో పని ప్రారంభించకుండా మహిళా రైతు పట్టా భూమి లో ప్రారంభిస్తూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని మహిళా రైతు తెలియజేయడం జరిగింది.
ఈ సమస్యను స్థానిక తహసిల్దార్, ఆర్ డి ఓ, కలెక్టర్ కు రాతపూర్వకంగా వివరించడం జరిగినది. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ నందు కలెక్టర్ కు మెమోరాండం సమర్పించి పరిస్థితిని వివరించడం జరిగిందని, సమస్య జఠిలం కావడంతో కోర్టును ఆశ్రయించి లీగల్ నోటీసు ఇప్పించడం,డిక్రీ తీసుకోవడం జరిగిందని వివరించారు.
తమకు వారసత్వంగా వచ్చిన పట్టాను, పూర్వకాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ స్వాధీనం(అనుభవదారు)లో ఉన్న భూమిని క్రీడామైదానం కోసం కబ్జా చేసే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు కుట్ర పన్నుతున్నారని దానిని విరమించుకోవాలని వారు కోరారు. ఇప్పటికే నేను ఆర్థికంగా చాలా నష్టపోయామని ఏమైనా జరిగితే మాకు మరణమే పరిష్కారమవుతుందని వారు హెచ్చరించారు.