మహా వెలుగు, హైదరాబాద్ 03 :నగరంలోని అమ్నేషియా పబ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. కారులోనే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత తనను కారులో తీసుకెళ్లిన తర్వాత రాత్రి ఏడు గంటల సమయంలో పబ్ వద్ద దింపారని బాధితురాలు వివరించారు.
హైదరాబాద్:నగరంలోని Amnesia పబ్ నుండి బలవంతంగా minor girl ను తీసుకెళ్లిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ మేరకు తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.
ఈ ఏడాది మే 28వ తేదీన స్నేహితులతో కలిసి తాను అమ్నేషియా పబ్ కు వెళ్లినట్టుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇచ్చిందని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. Pub నుండి సాయంత్రం ఐదు గంటల సమయంలో తనను కొందరు బలవంతంగా Carలో తీసుకెళ్లారని బాధితురాలు ఆ స్టేట్ మెంట్ లో వివరించారు. రాత్రి ఏడుగు గంటల సమయంలో తనను పబ్ వద్ద వదిలివెళ్లారని ఆమె వివరించింది. కారులో తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చారని ఆ మీడియా సంస్థ తెలిపింది. అమ్నేషియా పబ్ లో తాము పార్టీ చేసుకున్నామని కూడా బాలిక వివరించింది.
పార్టీ నుండి కొందరు గుర్తు తెలియని యువకులు తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని బాధితురాలు ఆ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. కారులో అత్యాచారానికి పాల్పడిన తర్వాత తనను పబ్ వద్ద దింపి వెళ్లిపోయారని ఆమె ఆ స్టేట్ మెంట్ లో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పినట్టుగా బాధితురాలు వివరించారు.
తనకు మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే తన తండ్రి పోలీసులకు పిర్యాదు చేసినట్టుగా బాధితురాలు తెలిపారు. బెంజీ కారులోనే అత్యాచారం జరిగినట్టుగా బాధితురాలు చెప్పారు. పబ్ వద్ద ఇన్నోవా కారులో తనను దింపేశారని బాలిక స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఈ కారులో బాలికతో పాటు ఐదుగురున్నారని బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఈ కేసులో ప్రజా ప్రతినిధుల పిల్లలున్నారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో వివరించినట్టుగా ఎన్టీవీ న్యూస్ చానెల్ తెలిపింది. అయితే ప్రజా ప్రతినిధుల పిల్లలు మైనర్ బాలికపై అత్యాచారం కేసులో వారికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పబ్ లోనే బాలికను ఓ ప్రజా ప్రతినిధి కొడుకు ట్రాప్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు.బంజారాహిల్స్ లోని బేకరి వద్ద పుడ్ కొనుగోలు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.
నిర్మానుష్య ప్రాంతానికి కారును తీసుకెళ్లి కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇచ్చిందని ఎన్టీవీ ప్రసారం చేసింది. బాలికపై అత్యాచారానికి ముందే ఓ ప్రజా ప్రతినిధి కొడుకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. బాలికను పార్టీకి పిలిచిన హాడీ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో 16 ఏళ్ల లోపు వారే ఉన్నారని సమాచారం.