భీమారo లో రోడ్డు ప్రమాదం

  • భూపాలపల్లి జిల్లా జిల్లాకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు
  • మంచిర్యాల ఆస్పత్రికి తరలించిన 108
  • పది రోజుల వ్యవధిలోనే ఇద్దరికి తీవ్రగాయాలు
  • కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు
  • కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి : వాహనదారులు

మంచిర్యాల ,మహా వెలుగు భీమారo 4 : భీమారంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. భూపాలపల్లి జిల్లా కు చెందిన వ్యక్తికి గాయాలు కాగా స్థానికులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పవన్ చరణ్ మంచిర్యాల జిల్లా కు పలు పనుల నిమిత్తం వెళ్లగా రాత్రి సమయం లో మంచిర్యాల – చెన్నూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాడు. భీమారం మండలం స్థానిక నరహరి మొరి వద్దకు రాగానే పవన్ చరణ్ బ్రిడ్జి కల్వర్టును ఢీకొని గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ మేరకు పోలీసులు వచ్చి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో సూచిక బోర్డులు తోపాటు కాంట్రాక్టర్ సరైన చర్యలు తీసుకోక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. గత పదిహేను రోజుల్లో రెండో ప్రమాదం బ్రిడ్జి వద్ద నెలకొందని అధికారులు సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ప్రజలు తెలుపుతున్నారు.

సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తక్షణమే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.