- కురవి మండల తాసిల్దార్ ఇమాన్యుయల్.
మహావెలుగు కురవి/జూన్09 రిపోర్టర్ చల్ల వేణు
మహబూబాబాద్ కురవి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం పై ఒక పత్రికలో ఈరోజు వచ్చిన వార్త లో ఏ మాత్రం నిజం లేదని కావాలనే ఉద్దేశపూర్వకంగా వార్త వేయడం జరిగిందని స్థానిక తహసిల్దార్ ఇమాన్యుయేల్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా సౌకర్యవంతమైన సేవలను అందించుటకు మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో ఉన్నదని, వేసవికాలంలో త్రాగునీరు ఏర్పాటుచేసి అందించడం జరుగుతుందని, ప్రజల కొరకు కుర్చీలు బల్లలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈసారి రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ మొత్తంలో ప్రజలు రావడం వల్ల కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చునని, ప్రజలు పెద్ద మనసుతో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం జరుగుతున్నదని, పరిస్థితుల ప్రభావం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం జరగవచ్చునని, దానిని భూతద్దంలో పెట్టి చూపించడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
