అక్రమ మట్టికి  కేరాఫ్ భీమారం , జైపూర్

మహా వెలుగు , మంచిర్యాల 14 :  అక్రమ మట్టి దందాకు భీమారం , జైపూర్ మండలాలు కేంద్రంగా మారాయి. అక్రమ దందా ధ్యేయంగా కొందరు అధికారులు , రియల్టర్లు పనిచేస్తున్నారు.

భీమారo లో రాత్రి కి రాత్రే తొడుతున్నారు

భీమారoలో కొందరు రాత్రి కి రాత్రే మట్టిని లారీల ద్వారా అక్రమంగా జైపూర్ కు తరలిస్తున్నారు. దీనికి కొంత మంది అధికారులు సైతం ప్రోత్సహిస్తున్నారు.  అభివృద్ధి పేరిట ఇక్కడ విలువైన మట్టిని జైపూర్ కు తలిస్తున్నారు. ఒక కంపెనీ పేరట అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పి రాత్రికి రాత్రే తెల్లవారుజామున , భీమారం నుండి లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారు.  కానీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా నడుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి మట్టి తరలించవద్దని రూల్స్  ఉన్న , వాటికి పర్మిషన్ లేకున్న జైపూర్ మండల కేంద్రంలో ఉన్న ఒక కంపెనీకి చెందిన వ్యక్తుల లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా జైపూర్ ,భీమారo లో పని రోడ్డు పనులు చేస్తున్న సంస్థ అక్రమ మార్గం ను ఎంచుకుంటున్నారు.  ఫ్లాట్లకు సైతం కంపెనీ కి చెందిన లారీల తోనే మట్టిని తరలిస్తున్నారు.

జైపూర్ లో ఓ సర్పంచ్

జైపూర్ మండల పరధి లోని కిష్టాపూర్ లో గుట్ట క్రింద జేసీబీ సాయంతో  మట్టిని అక్రమంగా తరలిస్తూ అమ్ముకుంటున్నారు. ఒక ట్రాక్టర్ కు మూడు వందల రూపాయల చొప్పున నిర్ణయంచి స్థానిక సర్పంచ్ సొమ్ము చేసుకుంటున్నాడు. అధికారులు సైతం అక్రమ దందా ప్రోత్సహిస్తున్నారు. అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.