కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ జీవోను రద్దు చేయాలి.

  • నిరుద్యోగ యువకుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
  • మండల కేంద్రాల్లో దీక్షలు.
    -మాలోతు నెహ్రూ నాయక్

మహావెలుగు కురవి/ జూన్ 27 రిపోర్టర్ చల్ల వేణు

కురవి మండల కేంద్రం లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ రద్దు చేయాలని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కురవి మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం దీక్షలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నెహ్రు నాయక్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిరోదగ్యులు పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కురవి వీరభద్ర స్వామి దేవాలయ ఆవరణలో నియోజకవర్గకాంగ్రేస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు దిగింది.ఈ దీక్షలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రు నాయక్ గారు పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా అగ్నిపథ్ పథకాన్ని తీసుకోవచ్చారని,దీనిని రద్దు చేసేవరుకు కాంగ్రేస్ పార్టీ పోరాడుతుంది అని,యువత చేసే ఆందోళన కార్యక్రమానికి మా మద్దతు ఎల్లపుడు ఉంటుందని,యువకులు ,మేధావులు ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం మొండి వైకరికి నశింపచేయలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు యుగేందర్ రెడ్డి గారు,కొండపల్లి రఘురాం రెడ్డి గారు,కురవి మండల భాద్యులు డివై గిరి గారు,శ్యామల శ్రీనివాస్ గారు,మరిపెడ మండల నాయకులు వెంకటరెడ్డి గారు,డోర్నకల్ మండల నాయకులు బికన నాయక్ ,డీస్ జగదీశ్ గారు,దంతాలపల్లి మండల అద్యక్షులు భరత్ బాబు గారు,గుగులోతు లాలూ నాయక్,రాజపుత్,మహిళ అధ్యక్షురాలు మాలోతు వినోద,ఆనంతుల ఉపేందర్ గౌడ్,దేవసింగ్ నాయక్,హరికృష్ణ,ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్,గంటా యాకేశ్,బానోతు శ్రీను,పకీరా,మాలోతు హరిలాల్,యూత్ నాయకులు అబినాష్ నాయక్,అనిల్,మాలోతు రాందాస్,ప్రవీణ్,తేజవత్ జైల్ సింగ్,మోహన్ పాల్గొన్నారు