మోదుగుల గూడెం జడ్.పి.ఎస్ ఎస్ లో విద్యార్థిని 9.8 ర్యాంక్.

  • ఎస్.కె హసీనా
  • మండలంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఏకైక విద్యార్థిని,

మహావెలుగు కురవి/ జూన్30 రిపోర్టర్ చల్ల వేణు

మహబూబాబాద్ కురవి మండలంలోని మోదుగులగూడెం జడ్ పి ఎస్ ఎస్ పాఠశాల లో చదువుకుంటున్న రోజుద్దీన్ కుమార్తె హసీనా పదవ తరగతి లో మండలంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని 9.8 ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలను అందుకొని పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు, గ్రామానికి మంచి పేరు తీసుకుని వచ్చినట్లు పలువురు ప్రశంసించారు.

ఈ విధంగానే ర్యాంకులు సాధించి మన జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తేవాలని వారు కోరారు. పిల్లలు రాణించితే తల్లిదండ్రులు సంతోషిస్తారని, తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలంటే పిల్లల నడవడిక వారి యొక్క ప్రతిభ పై ఆధారపడి ఉంటుందని, పిల్లల భవిష్యత్తు వారు తీసుకునే నిర్ణయము మీదనే ఆధారపడి ఉంటుందని పలువురు కొనియాడారు.

విద్యార్థి హసినా తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి, ప్రోత్సహించితే ఎన్నో బాగా చదివి,ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయలు హసీనాకు పుష్పగుచ్ఛం ఇచ్చిఅభినందించారు.