ప్రమాదంలో భీమారం తాసిల్దార్ కార్యాలయం

  • మరో చోటకు మార్చాలని కోరుతున్న కార్యాలయ సిబ్బంది

మహా వెలుగు ,మంచిర్యాల భీమారo 11 : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాసిల్దార్ కార్యాలయం ప్రమాద కరకంగా మారింది. ఎప్పుడు కులుతుందోని ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

తాసిల్దార్ కార్యాలయంలో నీరు చేరుతుండటతోపాటు పెంచుల సైతం ఊడిపోతున్నాయి. ఇప్పటికే కార్యాలయంలో ఉన్న విలువైన ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్లు , రికార్డులు వర్షానికి నానుతున్నాయి.

మరోచోట కార్యాలయం ఏర్పాటు చేయాలి

మరోచోట తాసిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు మరింత వర్షం వస్తే కార్యాలయం కూలే పరిస్థితిలో ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.