ముందస్తు చర్యలు తో ప్రమాదం తప్పింది

మహా వెలుగు ,మంచిర్యాల 12 : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు తెరవడం తో రాళ్ల వాగు ఉద్రిక్తత తో మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్,ఎల్ఐసి కాలనీ, మాత శిశు ఆస్పత్రి ప్రాంతం ఇళ్లలోకి అధికంగా నీరు ప్రవేశించడంతో అక్కడి పరిస్థితులు పరిశీలించి అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించిన మంచిర్యాల పోలీసులు.

మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి , మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ, రూరల్ సీఐ సంజీవ్, ఎస్సైలు సిబ్బంది కలిసి అక్కడి కాలనీ వాసులను వైశ్య భవనం, చర్చి, తాపీ మేస్త్రి లా సంఘం భవనంలోకి సురక్షిత కాలనీవాసులను తరలించడం జరిగింది. వరద నీరు పెరుగుతుందని ముందస్తు సమాచారం మేరకు కొంతమందిని ముందుగానే తరలించడం జరిగిందని దాని ద్వారా ప్రమాదం తప్పింది అన్నారు. ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనల మేరకు స్పెషల్ పార్టీ టీం లను రోప్స్ మరియు ఇతర పరికరాలతో ఎల్లప్పుడూ ఏలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా అప్రమత్తతో సిద్ధంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ సాయం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అత్యవరంగా సమయంలో డయల్-100 ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చి సహాయం అందించడానికి ప్రత్యేక రెస్క్యూ బృందము సిద్దంగా ఉంటుందని, ప్రజలు రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు.