మీకు ఎంత కష్టం వచ్చినా మీవెంటే నేను ఉంటా…

మహా వెలుగు , చెన్నూర్ 13 : మీకు ఎంత కష్టం వచ్చినా మీ వెంటే నేను ఉంటానని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓ మహిళకు చేతిలో చేయి వేసి చెప్పారు. గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల..

చెన్నూరు నియోజకవర్గం, జైపూర్ మండలం టేకుమట్ల – శెట్పల్లి గ్రామాల మధ్యలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాగును క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారుల తో మాట్లాడారు.

ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ… ఇప్పటికే ఈ వాగుపైన ఎనిమిది కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం కు ప్రతిపాదన పంపించినట్లు వారు తెలిపారు. వచ్చే వర్షాకాలం లోపు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు.

రసూల్ పల్లి వాగును పరిశీలించి

వాగును పరిశీలిస్తున్న విప్

జైపూర్ మండలంలోని రసూల్ పల్లి వగును పరిశీలించి విప్ సుమన్ సహాయ చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న ప్రయాణికులతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం చెన్నూర్ లో బతుకమ్మ వాగును , లక్షపూర్పూర్ పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జైపూర్ ఏసీపీ నరేందర్ , స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.