యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్‌ .. ఆ విధంగా టార్చర్‌ పెట్టడం భరించలేకే

మహా వెలుగు ,పెద్దపల్లి 14 : అప్పు ఆ యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. తల్లిదండ్రులు, మంచి ఉద్యోగం, ఎంతో భవిష్యత్తు ఉంచుకొని కేవలం క్రికెట్‌ బెట్టింగ్‌ లో డబ్బులు పోవడం వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌ లోన్ యాప్‌ లో రుణం తీసుకున్న పాపానికి నిర్వహకులు పెట్టిన టార్చర్‌ భరించలేకపోయాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంత జరిగినా లోన్‌ యాప్ నిర్వహకుల తీరు మాత్రం మారడం లేదు. కుటుంబ సభ్యులను అప్పు తీర్చమని వేధిస్తున్నారు.

వేధింపులు భరించలేక..

7వ తేది నాడు ఇంట్లో చెప్పకుండా వెళ్లి ప్రశాంత్ రెండ్రోజుల తర్వాత రాఘవపూర్ దగ్గర కేరళ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకును పోగొట్టుకొని పుట్టెడు బాధలో తల్లిదండ్రులు ఉంటే లోన్‌ యాప్‌ నిర్వాహకులు మాత్రం మరింత బరితెగించారు. వాట్సాప్‌ డీపీలోని తల్లిదండ్రుల ఫోటోలను తీసి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. తమ బిడ్డ లేడని ప్రాణాలు తీసుకున్నాడని చెబుతున్నా వినిపించుకోకుండా చనిపోతే మాకేంటి డబ్బులు కట్టాల్సిందేనంటూ టార్చర్‌ పెడుతున్నారని ప్రశాంత్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

లోన్ యాప్ ద్వారా పలువురు ఆత్మహత్య చేసుకుంటుంటే మరికొంతమంది ఇబ్బందులు గురవుతున్నారు ఈ లోన్ యాప్ లపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.