మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రకాంత్ 14 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ సమీపంలో ఉన్న గోదావరి నది వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలకు మధ్య రాకపోకలు నిలిపివేశారు. వాహనాలను గోదావరిఖని బస్టాండ్ వద్దనే ఆపివేశారు. పట్టణ శివారులో ఉన్న జనగామ, లారీ యార్డు, సప్తగిరి కాలనీ, గంగానగర్, ఉదయ నగర్, సప్తగిరి కాలనీలు ఇప్పటికే జలమయమయ్యాయి. సింగరేణి రెస్క్యూ, పోలీసులు, సహాయక బృందాలు పర్య వేక్షిస్తున్నారు.
