విప్ సుమన్ సహాయం

మహా వెలుగు , చెన్నూర్ 14 : చెన్నూరు నియోజకవర్గం, చెన్నూరు మండలం గోదావరి పరివాహక గ్రామాలు.. అక్కపెల్లి వాగు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది అక్కపెల్లి, చింతల పల్లి నుండి పారుపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేరకు బోటు సహాయంతో వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి ధైర్యం కల్పించి ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారితో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామస్తులకు సొంత ఖర్చులతో మెడిసిన్ అందజేశారు.

ఇందులో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతిహోళీ కెరీ , డిపిపి అఖిల్ మహాజన్ , ఏసీపీ నరేందర్ , నాయకులు మూల రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.