జీవితాంతం రుణపడి ఉంటాం..

  • విప్ సుమన్ హెలికాప్టర్ ఆపేరేషన్ లో ప్రాణాలతో బయట పడ్డ ఇద్దరు
  • సారయ్య ,గట్టయ్య

మహా వెలుగు చెన్నూర్ 15 : ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సోమనపల్లి గ్రామస్తులు ,బాధితులు

చెన్నూరు నియోజకవర్గం, సోమన్ పల్లి గ్రామం వద్ద నిన్న నిండు గోదావరి నదిలో చిక్కుకొన్న సారయ్య, గట్టయ్యలను.. ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ హెలికాప్టర్ తెప్పించి వారి ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం విప్ సుమన్ కు , కేటీఆర్ కు ,కేసీఆర్ కు ఋణ పడి ఉంటామని తెరాస పార్టీ కి రుణ పడి ఉంటామని వారు తెలిపారు. ఇందులోఎంపిపీ మంత్రి బాపు , జెడ్పీటిసి మోతే తిరుపతి , సిఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.