తాగిన మైకంలో ఓ వాచ్ మెన్ విద్యార్థులను చితకబాదాడు

వెలుగు,నార్నూర్‌, జూలై 31: తాగిన మైకంలో ఓ వాచ్‌మన్‌ విద్యార్థులను చితకబాదాడు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లోని ఎస్సీ వసతి గృహంలో ఈ ఘటన జరిగింది. 100 మందికిపైగా విద్యా ర్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. శుక్రవారం రాత్రి వాచ్‌ మన్‌ జావీద్‌ తాగిన మైకంలో వచ్చి.. ఇంకా ఎందుకు పడు కోలేదని వారిపై విరుచుకుపడ్డాడు. కర్రతో నలుగురు విద్యా ర్థులను చితకబాదాడు.

దెబ్బలను చూపిస్తున్న విద్యార్థి
ఈ విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీత శనివారం వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలు సుకున్నారు. తాము పడుకుంటున్నామని చెప్పినా వినిపించు కోకుండా వాచ్‌మన్‌ కొట్టినట్లు బాధిత విద్యార్థులు చెప్పారు. దీనిపై డీడీ సునీతను వివరణ కోరగా.. వాచ్‌మన్‌పై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.