మహా వెలుగు, జన్నారం, ఆగష్టు 01: మండలంలో గల తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం రోజున టీఎస్ డిఎల్ డిఏ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత పశు గర్భకోశ వ్యాధి అవగాహణ-చికిత్స, కృత్రిమ గర్భధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.అరవై గేదెలు,ముప్పై ఆవులకు గర్భకోశ వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు .కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి గంగాధర్,ఎంపీటీసీ దర్శనాల వెంకటస్వామి, పశుగణాభివృద్ధి సంస్థ ఆదిలాబాద్ అసిస్టెంట్ డైరక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఈర్ల శంకర్, మండల పశువైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్, తపాలపూర్ పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్, పశువైద్య సిబ్బంది కిషన్, సంజీవ్, సాగర్, వినోద్(మైత్రి మిత్ర), గోపాలమిత్ర సూపర్వైజర్ ఏ.రవి ,గోపాలమిత్ర రాజన్న పి&సి కంపెనీ ప్రతినిధి విద్యాసాగర్, పశుపోషకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు
