- పేద కుటుంభాలకు వరం
మహా వెలుగు, చెన్నూర్, ఆగష్టు 01:తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భారం కావద్దని భావించి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నరని చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమం ప్రతి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.పేద కుటుంబాల్లో అనందం నింపుతున్న పధకం కళ్యాణ లక్ష్మి అన్నారు. చెన్నూర్ నియోజకవర్గo లో మాంజూరైనా కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులు
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద యువతి పెళ్లికి కళ్యాణలక్ష్మి ఓ వరంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసిఆర్ ముందస్తు ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృధ్దిలో ముందుకు పోతుందని, రానున్న రోజుల్లో అభివృద్దిలో భారతదేశంలోనే నెం.1 రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందన్నారు. యావత్ భారతవనిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ ఫలాల అమలవుతుండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమానికే కేసిఆర్ పేద పీఠ వేశారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ప్రస్తుతం కాలంలో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఆర్థికశ్రమతో కూడుకుందని, ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసిఆర్ తన వంతు బాధ్యతగా కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి, అమలుచేస్తు పేదింటి కుటుంబాల్లో ఆనంద వెలుగులు నింపుతున్నారన్నారు. భారతదేశంలో కళ్యాణలక్ష్మి పథకం గర్వించదగిన పథకమని… పేదింటి ఆడబిడ్డకు పెళ్లి భారం కావద్దు అనే సంకల్పంతోనే కేసిఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నారన్నారు. కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండనివ్వకుండా సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
