మహా వెలుగు,రామగుండం, ఆగష్టు 01: పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ఏసీపి కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఏసీపి కార్యాలయంలోని FIR అబ్స్టాక్ట్స్ ఇండెక్స్, సిడి ఫైల్స్, ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన రికార్డ్స్ ని, ఇతర రికార్డ్స్ పరిశీలించడం జరిగింది. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లలో ఎక్కువ గా నమోదయి తో ఉన్నటువంటి కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తుగా నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణకై పోలీస్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ లు నిర్వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేర నియంత్రణలో భాగంగా సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అందుకు అనుగున్నంగా ప్రజలకి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలని అవగాహన కల్పించాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలో జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై కఠినంగా వ్యవహారించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భూ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అదేశిస్తూ కోర్ట్ ల ద్వారా సమస్యలని పరిస్కరం చేసుకునే విధంగా ప్రజలకి సూచించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్. డి ఆఫ్జాలోద్దీన్,మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతాల లక్ష్మీనారాయణ,ఎస్ఐ లు గారు పాల్గొన్నారు….
