మహా వెలుగు, కురవి,ఆగస్టు 02:మండలం కాంపల్లి గ్రామపంచాయతీ తునికి చెట్టు తండా నివాసి బనోత్ దసురు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందినారు. సీఎం సహాయం నిధి నుంచి రూ. 60000 గిరిజన శిశు సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ సహాయ సహకారాలతో కొరవి మండల జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి గుండ్రాతిమడుగు తన స్వగృహంలో వారికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అర్జున్ చవాన్,బత్తిని ఎంకన్న,అనిల్ రెడ్డి, సోమినరసింహారెడ్డి,జామలా నాయక్,ఉపేందర్,కోటి,తదితరులు పాల్గొన్నారు.
