జైపూర్ లో మావోయిస్టు అరెస్ట్

మహా వెలుగు , మంచిర్యాల ఆగస్టు 3 : బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని గ్రామాల్లో రాత్రి వేళల్లో తిరుగుతూ విప్లవ సాహిత్యం యువతకు వినిపిస్తున్నాడనే సమాచారం మేరకు ఉదయం తన సిబ్బందితో శ్రీరాంపూర్ సీఐ. బి రాజు జైపూర్ SI రామకృష్ణ ఇతడి ఇంటి వద్ద తనిఖీ చేయగా ఇతని వద్ద ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు విప్లవ సాహిత్యాలు దొరికినవి వెంటనే అతని మీద కేసు నమోదు చేసి ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు విప్లవ సాహిత్యాల ను సీజ్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగిందిఅని ఏసీపీ తెలిపారు.

ఏసీపీ నరేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జైపూర్ పోలీస్ స్టేషన్ వేలాల గ్రామానికి చెందిన గూడూరు ప్రశాంత్ ఇలియాస్ సురేష్ కూలి పనులు చేసుకుంటూ వేలాలలో నివసించేవాడు చతిస్గడ్ , చర్ల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మావోయిస్టు సానుభూతిపరుల నుండి వారు చెప్పిన విషయాలకు ,సోషల్ మీడియాలో మావోయిస్టుల వీడియోలను చూసి ఆకర్షితుడై ఈ సంవత్సరం16 జనవరి రోజున ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లి పోయినాడు. ఇంటి నుండి వెళ్లిపోయిన గూడూరు ప్రశాంత్ భద్రాచలం వెళ్లి అక్కడినుండి చతిస్గడ్ నేషనల్ పార్క్ కి వెళ్లి అక్కడ TSC మెంబర్ మరియు ప్రెస్ టీం మరియు సింగరేణి కాల్ బెల్ట్ ఏరియా కమిటీ బండి ప్రకాష్ టీం మరియు కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఏరియా కమిటీ ఇన్చార్జి అయిన మైలారపు ఆడేల్లు అలియాస్ భాస్కర్ అతని టీం లో కూడా జాయిన్ కావడం జరిగిందని తెలిపారు.

ఇతను పాడుతున్న పాటలు మాట్లాడే విధానం మావోయిస్టు నేతలకు నచ్చి ఇతను ఇక్కడ ఉండడం కంటే గ్రామాలలో వెళ్లి విప్లవ సాహిత్యాన్ని అమాయకమైన యువతకు మాయ మాటలు చెప్పి గ్రామాలలో ప్రజా వ్యతిరేక విధానాలను ఉసిగొలిపి మావోయిస్టులపై ఆకర్షణతో ఉన్న యువతకు అందించి వారిని కూడా మావోయిస్టు సంఘాలతో మమేకం అయ్యేలా కృషి చేయడం కోసం ఇతడిని ఆదేశించి. ఇతనికి కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలు ఇచ్చి తమ గ్రామంలో యువతకు వినిపించమని , పంచిపెట్టమని తద్వార మన మావోయిస్టు బలం పెరుగుతుందని మనము గ్రామాలు సందర్శించినప్పుడు మనకు అన్ని విధాలా సపోర్టుగా ఉంటారని, ప్రజా స్వామ్య బద్దంగా ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలన్న ఉద్దేశ్యంతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడానికి అమాయకమైన యువతని, ప్రజలను ప్రభావితం చేసి పోలీసులపై, ప్రజా ప్రతినిథులపై దాడులు చేయడానికి విప్లవ సాహిత్యాన్ని చదివి వినిపించి ప్రజలను నిషేధిత మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులను చేయమని చెప్పి పంపించగా ప్రశాంత్ కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలు తీసుకొని గత నెల రోజులుగా విప్లవ సాహిత్యం తీసుకొని రహస్యంగా తిరిగి వేలాలకు వచ్చి జైపూర్ మండలంలో మారుమూల గ్రామాలలో రాత్రి వేళల్లో విప్లవ సాహిత్యం యువతకు వినిపిస్తున్నాడు అని పక్క సమాచారం వరకు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు వారు తెలిపారు.