ఎస్ బీఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ల పంపిణీ

మహా వెలుగు,కాగజ్ నగర్ , ఆగష్టు 05: దేశభక్తి స్వతంత్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర వజ్రోత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఇండియా కాగజ్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఈరోజు స్థానిక బ్యాంకులో వ్యాపారస్తుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం వ్యాపారస్తులకు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ శుక్రవారం ఉద్యోగులు 6వ తేదీన రోడ్ షో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయగలరని మేనేజర్ వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, కౌన్సిలర్ రాజేందర్, వ్యాపారస్తులు చిలువేరు ప్రవీణ్, అరుణ్ అగర్వాల్,రితేష్ అగర్వాల్, రాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు