ఉద్యోగాల పేరుతో భారీ వసూళ్లు

మహా వెలుగు ,చెన్నూర్ 10 : ఉద్యోగాల పేరుతో భారీ వసూళ్లు చేసినట్లు సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి… చెన్నూర్ పట్టణం లోటిఆర్ఎస్ పార్టీ కి చెందిన ఓ నాయకుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ లో తిరుగుతూ… అమాయకులకు వల వేసినట్లు తెలుస్తుంది.
అధికార పార్టీ లో చురుకుగా కనిపిస్తూ.. నమ్మించి మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారం మొత్తం చెన్నూర్ లో హాట్ టాపిక్ గా మారింది కానీ బాధితులు ఎవరు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించలేదని పోలీస్ లు తెలుపుతున్నారు.

ఓ వర్గం పోలీస్ లకు ఫిర్యాదు చేయాలని ఒత్తిడి

కాగ ఓ వర్గం మాత్రం డబ్బులు తీసుకున్న వారి పై చర్యలు తీసుకునేల భాదితులను రెచ్చకొడుతున్నట్లు తెలుస్తోంది.