గల్స్ కార్మికునికి ఆర్థిక సాయం అందజేత

మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణ జన్నారం, ఆగస్ట్ 11 జన్నారం మండలం లోని చింతగూడ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు ఉప్పు లింగారెడ్డి గత పది రోజుల క్రితం దుబాయ్ దేశంలో వచ్చిన వరదల్లో చిక్కుకొని మృతిచెందాడు. పది రోజుల తర్వాత మృతదేహం సోమవారం రోజు స్వగ్రామానికి చేరుకుంది. ఎన్నో ఆశలతో దుబాయ్ వెళ్లిన లింగారెడ్డి కుటుంబంలో నిరాశే మిగిల్చింది. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య, తల్లి ఉన్నారు. వీరి కుటుంబానికి చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు ఏనబై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు లింగారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు పానుగంటి శ్రీనివాస్, సభ్యులు రాజు నాయక్ జగదీష్ యాదవ్ మంద గణేష్, భీమన్న, సురేష్, తదితరులు పాల్గొన్నారు