జాతీయ సమైక్యతను చాటేలా ఫ్రీడం రన్

మంచిర్యాల :మహ వెలుగు :ఆగస్టు 11: 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గురువారం మంచిర్యాల పట్టణం లో మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీకేరి మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహజన్ ఐపిఎస్, DFO శివాని డున్గ్రే, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు కలసి ఫ్రీడం రన్ ప్రారంభించారు. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తా నుండి ప్రారంభమై బెల్లంపల్లి చౌరస్తా మీదుగా బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ వరకు కొనసాగింది. పోలీస్ అధికారులు సిబ్బంది జాతీయ త్రివర్ణ జెండా కలర్ ఉన్న టీషర్ట్లు ధరించి ఫ్రీడమ్ రన్నింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కలెక్టర్ మరియు ఇంచార్జ్ డీసీపీ, ఎమ్మెల్యే ఇతర అధికారులు రన్నింగ్ లో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, జై హింద్ అంటూ నినాదాలు చేసుకుంటూ విజయవంతంగా రన్నింగ్ కొనసాగింది.

మన రాబోవు తరాల గురించి భారత జాతి ఖ్యాతిని స్వతంత్ర పోరాటం యొక్క ఫలితాలను స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియ పరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. స్వసంత్రం సిద్ధించడానికి ఎంతోమంది త్యాగాలు చేయడం జరిగిందని మహానుభావుల జీవిత చరిత్రలు చదివి వాళ్ల ఆశయాలకు అడుగులు వేయాలని సూచించారు. ఇప్పుడు మనము అనుభవిస్తున్న ఈ స్వతంత్ర
వెనుక ఎంతో మంది మహానుభావుల వెలకట్టలేని ప్రాణత్యాగం ఉన్నదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ నారాయణ , పోలీస్ అధికారులు సిబ్బంది, మంచిర్యాల పట్టణ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.