ఎస్ఐ రాత పరీక్ష రాసింది తల రాత మారింది


మహా వెలుగు :హైదరాబాద్ :ఆగస్టు 11
ఆమెకు పోలీస్ అధికారి కావాలనే కోరిక. ఆమె కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడి చదివింది. ఆడపిల్ల అయినప్పటికి పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఎస్ఐ రాత పరిక్ష ఆమె తల రాతను మార్చుతుందని ఊహించలేకపోయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ … జీవితంలో అగ్రస్థానాన్ని చేరుకోవాలనే విషయాన్ని మర్చిపోయి తనలోని అనుమానం, అసంతృప్తితో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐ కావాల్సిన యువతి పరీక్ష రాసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
జిల్లా మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామానికి చెందిన పంచశీల అనే 22సంవత్సరాల యువతి పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలని కలలు కనింది. తన కలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో హైదరాబాదులోని ఓ కోచింగ్ సెంటరులో ఎస్సై పరీక్ష కొరకు కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయింది. ఈనెల 7వ తేదిన‌ నిర్వహించిన ఎస్సై రాత పరీక్ష రాసింది. అయితే ఆ ప‌రిక్ష‌లో త‌ను అనుకున్నాంత బాగా రాయ‌లేక‌ పోయాని… పరీక్షలో ఫెయిల్ అవుతానేమని మనస్తాపానికి గురైంది.

తనువు చాలించిన యువతి..

మంగళవారం హైద‌రాబాద్ నుంచి బ‌స్సులో బ‌య‌లు దేరిన పంచశీల దారి మ‌ద్య‌లో బిక్క‌నూర్ మండ‌లం జంగంప‌ల్లి గ్రామం బ‌స్టాప్ లో దిగింది. అదే గ్రామంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే యువతి ఆత్మహత్యకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడింది. అయితే పంచశీల మాటలతో వెంటనే కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు యువతి సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా జంగంపల్లి పెద్ద చెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు.