- శ్రీరాoపూర్ సిఐ రాజు
భీమారo : గణేష్ మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని , ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న గణేష్ మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీరాoపూర్ సిఐ రాజు సూచించారు. భీమారo మండల కేంద్రంలోని నిర్వహకులతో బుధవారం సాయంత్రం మాట్లాడుతూ…. నవ రాత్రి ఉత్సవాల పై అవగాహన కల్పించారు. భీమారo మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండపాలను పరిశీలించారు. ఇందులో ఏఎస్ ఐ భూమన్న , సిబ్బంది మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
