పేలిన గ్యాస్ సీలిండర్… ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

మహా వెలుగు, భీమారం 01: హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన విషాద ఘటన హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్ విహార్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానికులు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బాదం మిల్స్ షేక్‌కు సంబంధించిన గోడౌన్‌ లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.