మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన మంచిర్యాల జిల్లా లో చోటుచేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలికపై ఇద్దరు యువకులు రెండు రోజుల కిందట అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పిర్యాదు మేరకు కన్నేపల్లి పోలీసులు పొక్సో ఆక్ట్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడ పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం తరలించారు.
