శోభా యాత్రలో డిజెలకు అనుమతి లేదు, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.

మహా వెలుగు ,న్యూస్ 05 : నిర్వాహకులు నిమజ్జనం తేదీని, నిమజ్జనానికి వెళ్లే ప్రదేశాన్ని, ఏమార్గం గుండా వెళ్ళేది తదితర వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన కు తెలియజేయాలని , నిమజ్జన ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరుగకుండా జాగ్రత్తగా ఉండాలని ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

మంచిర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లాలలోని గణేష్ ఉత్సవ సమితి, మత పెద్దలు,రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనలను పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభయాత్ర జరుపుకోవాలని అన్నారు. వినాయక ఉత్సవాలలో, శోభయాత్ర లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుగాని, ఘర్షణలు గాని జరుగకుండా చూడటం మనందరి బాధ్యత అని, ఏ రూపం లో ఉన్న దేవుడు ఒక్కరే అని అన్నారు. అన్ని మతాల వారు కలసి పండుగలు జరుపుకోవడం గొప్ప ఆచారమని, ఇది ఎంతో అభినందించాల్సిన విషయం అని అన్నారు.

సోషల్ మీడియా లో వచ్చే పుకార్లు నమ్మవద్దు అని, ఏ చిన్న సమస్య ఉన్న పోలీస్ వారికి తెలియ చేస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, స్థానిక పోలీస్ అధికరులకు కాల్ చేయాలని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని సూచించారు.

నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని, నిర్దేశించిన విదంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు.

శోభా యాత్రలో డిజెలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు పాటించకపోయినా, శోభా యాత్రలో డి.జె.లు వాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా శోభాయాత్ర సమయంలో విద్యుత్ తీగలు విగ్రహాలకు తగలకుండా చూసుకోవాలని, ఇనుప విద్యుత్ స్థంబాలు ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా మండపాల నిర్వహకులంతా పోలీసుల సూచనలు పాటించాలని, వారికి కేటాయించిన నెంబర్ల ప్రకారం విగ్రహాలను తరలించేలా చూసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలకు కేటాయించిన నెంబర్ల ప్రకారం, సమయాన్ని విధిగా పాటిస్తూ నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని కోరారు. నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జన ఊరేగింపులో ఎట్టి పరిస్థితుల్లోనూ డి.జె.లను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, సమస్యలు సృష్టించే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

వినాయక నవరాత్రులు, నిమజ్జనం ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన విధంగా జరుపుకోవాలని వారు సూచించారు. మండపాల వద్దకు ఏ శాఖ అధికారులు వచ్చిన సహకరించాలని, మైక్ సిస్టమ్, శబ్ద కాలుష్యం లేకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా పరిమితి మేరకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు.

గణేష్ ఉత్సవ సమితి కోరిన విధంగా గణేష్ శోభా యాత్ర నిర్వహించే రూట్ లో గుంతలు పడిన రహదారులు ప్యాచ్ వర్క్ రిపేర్లను మున్సిపల్, ఆర్ & బి అధికారులు చేపట్టాలని సూచించారు. నిమజ్జన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా శాంతోషంగా సంబరాలు జరుపుకోవాలని డీసీపీ గారు అన్నారు.

*చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును*.

పోలిస్ మీ కోసం ఉన్నదని మరిచి పోవద్దు. ప్రతి పౌరుని రక్షణ మా బాధ్యతని తెలిపారు. ఈ సమావేశం లో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, సీఐ లు నారాయణ, సంజీవ్, కరీముల్లా ఖాన్, ప్రమోద్ రావు, రాజు, బాబు రావు, జగదీష్, బి. రాజు, ప్రవీణ్ కుమార్, విద్య సాగర్ లు, శ్రీనివాస్, నరేష్ కుమార్, ఎంఆర్‌ఓ మంచిర్యాల దండేపల్లి, జిల్లా లోని ఎస్ఐ లు, ఫిషర్ డిపార్ట్‌మెంట్, ఫైర్ డిఎఫ్‌ఓ, ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్, ఆర్‌ఐ దండేపల్లి, మున్సిపల్, విశ్వ హిందూ పరిషత్ ఉత్సవ కమిటీ, మత పెద్దలు, మండపాల నిర్వహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.