అమ్మాయిలను ఫోన్ లో చిత్రీకరించాడు అంతలోనే మరణించాడు

మహా వెలుగు న్యూస్ 06: హైదరాబాద్ లో ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన నీచమైన పనికి దారుణమైన శిక్షపడింది. స్నేహితుడి గదికి వెళ్లి మందు తాగిన తర్వాత పై ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న అమ్మాయిల గదికి వెళ్లాడు. ఇద్దరు యువతులు నిద్రపోతున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్ లో కిటికీలోంచి చిత్రీకరిస్తుండగా ఫ్లాష్ లైట్‌ పడటంతో అమ్మాయిలు అతడ్ని గుర్తించారు. వెంటనే అపార్ట్మెంట్ ఉంటున్న వారికి ఫోన్ చేయడంతో యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. వేరే అపార్ట్‌మెంట్‌లోకి దూకేందుకు ప్రయత్నించగా కాలు జారి థర్డ్ ఫ్లోర్ పై పడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో చనిపోయాడు. మద్యం మత్తులో చేసిన దుశ్చర్యకు మరణశిక్ష పడటం చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు