దేశ రాజకీయాలను పక్కన పెట్టి విద్యార్థులకు ఉన్నత చికిత్స అందించాలి

హైదరాబాద్ ,సెప్టెంబర్ 6 : తెలంగాణలో రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్దులు నాసీరకం భోజనం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు గత రెండు నెలలుగా వరుసుగా వెలుగులోకి వస్తున్నప్పటికి ప్రభుత్వం వాటిని అరికట్టడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌ లో బల్లి పడిన ఆహారం తిని 50మందికిపైగా విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో పది మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ రాజకీయాలు పక్కనపెట్టి అనారోగ్యానికి గురైన విద్యార్ధినులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్‌ కి ప్రకటన ద్వారా సూచించారు. అవసరమైతే స్టూడెంట్స్‌ని హైదరాబాద్‌ కు తరలించి ట్రీట్‌మెంట్ అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరో 50మంది స్టూడెంట్స్‌కి అస్వస్థత..

తెలంగాణ సంక్షేమ ప్రభుత్వ హాస్టళ్లు,గురుకులాల్లో విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడం పరిపాటిగా మారింది. గడిచిన మూడు నెలల్లో ఈసంఘటనలు పదుల సంఖ్యలో బయటపడటంతో ప్రభుత్వం ఏం చేస్తోందనే విమర్శలు అన్నీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం సాయంత్రం విషతుల్యమైన భోజనం తినడం వల్ల 50మందికిపైగా విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. స్టూడెంట్స్‌కి వడ్డించిన ఆహారంలో బల్లి పడిందని చనిపోయిన బల్లిని తీసి వడ్డించడం వల్లే సుమారు 60మంది విద్యార్ధినులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. సోమవారం రాత్రి విద్యార్దినులు హాస్టల్‌ స్టూడెంట్స్ పరిస్థితి విషమంగా మారడంతో సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ 55మందిలో కొందరికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపారు. మిగిలిన 30మందికి సీరియస్‌గా ఉండటంతో వరంగల్ ఎంజీఎంలో కొందరిని వర్ధన్నపేట ఆసుపత్రిలో మరికొందరికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.