-జర్నలిస్టు డే తో జ్ఞాపికలు బహుకరించిన వాసవిక్లబ్
మంచిర్యాల జిల్లాలో అత్యుత్తమైన సేవలు అందిస్తున్నా జర్నలిస్టులను మంగళవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా మంచిర్యాల వాసవి క్లబ్ నేతృత్వంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఘనంగా సన్మానం చేశారు.ఆ క్రమంలో చూస్తే…. 24 గంటలు విశేషమైన గొప్ప సేవలందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విశేషమైన మంచి సేవలు అందిస్తున్నా ఆ వర్కింగ్ జర్నలిస్టుల యొక్క గొప్ప విధులను గుర్తిస్తూ ఆ రోజు సాయంత్రం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయ లతోపాటు వర్కింగ్ జర్నలిస్టులను సత్కరించడంతో పాటు ఆ క్లబ్ కమిటీ నాయకులు జ్ఞాపికలు,పెన్ నోట్ బుక్ ను సైతం బహూకరించడం జరిగింది.ఆ కార్యక్రమంలో వాసవి క్లబ్ కమిటీ పట్టణ అధ్యక్షలు కేశెట్టి వంశీకృష్ణ,టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు రూపీరెడ్డి ప్రకాష్, అక్షరం దినపత్రిక మంచిర్యాల బ్యూరో రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్,నాయకులు కాచం సతీష్,శ్రీనివాస్,రమేష్, మధు,భాస్కర్,వెంకటస్వామి,ఎర్రం ప్రభాకర్, సురేష్,కే. శ్రీనివాస్, వాసవి వనిత క్లబ్ మహిళా నాయకురాలు,ఇతర దినపత్రికల జర్నలిస్టులు,తదితరులు పాల్గొన్నారు.