మహా న్యూస్ రామగుండం సెప్టెంబర్ 06:-
ఆర్ జి 1 ఏరియాకు సంబందించి పలు సివిల్ సంబందించిన పనుల పురోగతి , ఏరియా లో ఉన్న పలు సివిల్ సంబందిత పనుల గురించి అధికారులతో ఆర్ జి 1 ఏరియా జీఎం కె . నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్బంగా ఆర్ జి 1 ఏరియాలో జరుగుతున్న సివిల్ పనులు వాటి యొక్క పురోగతి క్వార్టర్ ల మరమ్మత్తులు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కు సంబందించిన పలు సివిల్ సంబందిత పనుల గురించి సివిల్ అధికారులు మరియు సివిల్ సుపర్వైజర్లతో జీఎం సమీక్షా సమావేశం నిర్వహించటం జరిగింది . జీఎం మాట్లాడుతూ సివిల్ కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన పనులను త్వరిత గతిన పూర్తి చేసేలా చూడాలని వారికి కేటాయించిన పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి చేసేలా చూడాలని సుంచించారు. ఏరియా లో జరుగుతున్న సివిల్ సంబంధించిన పనుల గురించి అధికారులతో చర్చించారు. ఏరియాలో అవసరమైన సివిల్ వర్క్ ను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఎస్.ఓ.టు.జీఎం ఎం రామ్ మోహన్ ఏరియా ఇంజనీరు జగన్ మోహన్ రావు డీజీఎం పర్సనల్ సి/హెచ్ లక్ష్మి నారాయణ, డీజీఎం సివిల్ నవిన్ , డీజీఎం ఏరియా వర్క్ షాప్ మధన్ మోహన్ , సర్వే అధికారి పి ప్రభాకర్ , ఎస్టేట్ మేనేజర్ బాల సుబ్రమణ్యం ఎన్విరాన్ మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరా రెడ్డి, సివిల్ ఇంజనీరు దుర్గా ప్రసాద్ , వెంకటేశ్వర్లు,మల్లేశ్ , వెంకటేష్ మరియు సివిల్ సూపర్ వైజర్లు ఇతర అధికారులు పాల్గోన్నారు.