SRP -1 గని లో ప్రమాదం
కార్మికుడు మృతి

మహా వెలుగు , మంచిర్యాల 08 : శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-1 గని రెండవ షిఫ్ట్ లో గని ప్రమాదం సంభవించింది.

తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. 7 డీప్ లో బొగ్గు లోడింగ్ ట్రబ్బులు మీద పడి బండారి రాజలింగు (BANDARI RAJALINGU) (54 ) మృతి ఈ సింగరేణి కార్మికుడు (ట్రామర్ మున్సి) కి రెండవ సిఫ్టు లో పని చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. హుటాహుటిన పని స్థలం నుండి తోటి కార్మికులు రామకృష్ణా పూర్ ఏరియా ఆసుపత్రికి తరలించడం తో వైద్యులు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. కాగా మృతుడు శ్రీరాంపూర్ నివాసి భార్య ముగ్గురు పిల్లలు అన్నారు.