40 వేల మందితో టిఆర్ఎస్ కు రాజీనామా చేస్తా

  • చెన్నూర్ నియోజకవర్గo లో సుమన్ కోసం ఎంతో కష్టం పడ్డాం
  • సుమన్ కు నా తమ్ముడి గా చెప్తున్న ఒట్టేందు పోకట తగదు
  • చెన్నూర్ ను సిద్దిపేట ,సిరిసిల్ల గా చేస్తా అన్నావు చేయలేదు
    -నేను ఏ పార్టీ కి లో పోను , సంఘ సంస్కర్త లాగా ఉంటా…
  • టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సరోత్తం రెడ్డి

భీమారo , సెప్టెంబర్ 09 : జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది తో తాము టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తానని తమ వెంట సర్పంచ్ లు ,ఎంపిటిసిలు నాయకులు ,ప్రజలు ,ఉన్నారని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సరోత్తం రెడ్డి పేర్కొన్నారు.

భీమారo మండల కేంద్రంలోని స్థానిక సరోత్తం రెడ్డి నివాసం లో ఆరుగురు సర్పంచ్ లు , ఒక్క ఎంపిటిసి సభ్యులు , స్థానిక మండల నాయకులతో సమావేశo ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రానున్న మూడు ,నాలుగు రోజుల్లో 40 మంది తో సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

రాష్టం లో కేసీఆర్ తర్వాత ,కేటీఆర్ తర్వా oiత సుమన్ కానీ సుమన్ ఎక్కడ పని చేయలేదని తెలిపారు. చెన్నూర్ ను సిద్దిపేట ,సిరిసిల్ల లాగా చేస్తా అని చెప్పి ఇంత వరకు పనులు చేయలేదని వారు తెలిపారు. మండల స్థాయి లో రాజీనామా అయితే నేను ఈ రోజే రాజీనామా చేయాలని అనుకున్న కానీ నాతో పాటుగా జిల్లా స్థాయి లో రాజీనామా చేసేందుకు కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. మున్సిపల్ కౌన్సెలర్ లు , జడ్పీటీసి , ఎంపిటిసి లు , కార్యకర్తలు నాతో రాజీనామా కు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కొద్దీ రోజుల్లోనే పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇక నుండి రాజీనామాల పర్వo కొనసాగుతుoది. సుమన్ ఎమ్మెల్యే గా గెలుపు కోసం ఎంతో కష్టం పడ్డాం కానీ ఇద్దరి ముగ్గురిని క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకున్నాడు.త్వరలోనే మార్పులు చూస్తారని చెరుకు సరోత్తం రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు దుర్గం మల్లేష్ , గోదారి తిరుపతి ,దాడి తిరుపతి , వడ్ల కొండ రమాదేవి , చేడoక లక్ష్మీ , అరెపల్లి సర్పంచ్ సునీత తో ఎంపిటిసి సభ్యులు పెద్దల రూప ,మాజీ జడ్పీటిసి జర్పుల రాజ్ కుమార్ నాయక్ , పొడేటి రవి , నల్లాల రాజలింగు, కో అప్షన్ సభ్యులు బాబర్ ఖాన్ , పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.