మీడియా పై బ్లాక్ మెయిల్ రాజకీయం

  • మీడియా ను ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ రాజకీయం
  • మీడియా తప్పుడు కథనాలు ఇచ్చిందని ఆరోపణ చేసిన సరోత్తం రెడ్డి

మంచిర్యాల , మహా వెలుగు 13 : చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒట్టేందు పోకడలకు నిరసన గా గత శుక్రవారం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ప్రముఖ వ్యాపార వేత్త తన నివాసం లో ప్రెస్ మీట్ పెట్టి విప్ సుమన్ పై ధ్వజమెత్తారు. తాము పార్టీ లో నుండి వెళ్తున్నట్లు ప్రకటించారు. తాము భీమారo కు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలానే సంఘ సంస్కర్త లాగే ఉంటానని మీడియా ముందు ప్రకటించారు. ఈయన కవరేజ్ కి చెన్నూర్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద ఎత్తున తరలివచ్చింది.

భీమారo మండలానికి చెందిన ప్రముఖ పత్రికల విలేకరులు సైతం అక్కడకి వెళ్లి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. సరోత్తం మాట్లాడింది. మాత్రమే ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. కానీ సరోత్తం రెడ్డి ఆదివారం బాల్క సుమన్ కలిసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం విప్ సుమన్ కూడా సానుకూలంగా స్పందించి అలాంటి తప్పిదాలు మళ్ళీ దొర్లకుంటా చూసుకోవాలని చెప్పారని సమాచారం. ఇది ఇలా ఉండగా ఆదివారం రాత్రి సరోత్తం రెడ్డి మాట్లాడుతున్న వీడియో ను విడుదల చేశారు. తాము టిఆర్ఎస్ పార్టీ ని విడటం లేదని , జనరల్ బాడీ లో జరిగిన చిన్న గొడవ వల్ల అలా నిర్ణయం తీసుకున్నట్లు ,విప్ బాల్క సుమన్ సారధ్యంలోనే పని చేస్తున్నట్లు ,సుమన్ చెన్నూర్ నియోజకవర్గo లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రెండు మూడు పత్రికల్లో అలా రాశారని అది దురదృష్ట కరం అని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇలా తమ రాజకీయాల కోసం మీడియా ను వాడుకోవడం తో విలేకరులుగా పని చేసే ప్రతి ఒక్కరు తల దించుకునే పరిస్థితి వచ్చిందని మీడియానే తప్పు చేసినట్లు మాట్లాడటం తగదని విలేకరులు పేర్కొంటున్నారు.