- భీమారo లో కరపత్రాలు విడుదల చేసిన ఎల్ఐసి ఏజెంట్ రేషవని శ్రీనివాస్
మహా వెలుగు , భీమారo : ఊరు ఊరున ఎల్ఐసి పై అవగాహన కార్యక్రమo లో బుధవారం ఎల్ఐసి ఏజెంట్ రేషవేని శ్రీనివాస్ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా భీమారo సర్పంచ్ గద్దె రాం రెడ్డి తో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. భీమారo మండల వ్యాప్తంగా అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్ రేషవేని శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎల్ఐసి 66 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు.
ఎల్ఐసి పాలిసీ చేసి మధ్యలో ఆగిన పాలిసీలను పున: ప్రారంభించడానికి మంచి అవకాశం ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే ఎల్ఐ సి లో వచ్చిన నూతన పాలసీ ల పై అవగాహన కల్పించారు.