మహా వెలుగు పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అతడికి దేహశుద్ధి చేసింది. భర్తను ఓ కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. చెప్పుల దండ మెడలో వేసి అల్లరి పాలు చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విచిత్ర మైన ఘటన మంథనిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అఖిల పేరెంట్స్ శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. అయితే, వీరిద్దరికీ కొడుకు జన్మించిన అనంతరం.. శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు.
అనంతరం, వరంగల్లో మరో మహిళను వివాహం వేసుకున్నట్టు తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం, శ్రీకాంతను కరెంట్ పోల్ కు కట్టేసి.. భార్య అతడిని చితకబాదింది. చెప్పుల దండల తో కొట్టింది. ఈ క్రమంలో చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. కట్టుకున్న భర్త తనను విడిచి వేరే ఆమెను పెండ్లి చేసుకుంటే తట్టుకోలేక పోయింది. ఈ పంచాయతీ కాస్త వైరల్ గా మారడం తో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.