కరాటేతో క్రమశిక్షణ పెరుగుతుంది : ఏసిపి

మహా వెలుగు , రామగుండం సెప్టెంబర్ 19:- రాకేష్ నామని: విద్యార్థులు విద్య తోపాటు, కరాటే లో రాణించడం వల్ల క్రమశిక్షణ. ఆత్మస్థైర్యo మెరుగుపడుతుందని గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ అన్నారు.


ఆదివారం సుమన్ శోతోకాన్ కరాటే అకాడమీ ఇండియా తెలంగాణ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కల్నల్ సంతోష్ బాబు మెమోరియల్ జాతీయస్థాయి ఓపెన్ కరాటే కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ 2022 ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులను గిరిప్రసాద్ అభినందించారు. కరాటే నేర్చుకోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 3672 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా జపాన్ షూటోరియో కరాటే స్కూలుకు చెందిన విద్యార్థిని విద్యార్థులు కటాస్ ,కుముతి విభాగాలలో బంగారు, వెండి ,కాంస్య పథకాలు సాధించారని కోచ్ కరాటే శ్రీనివాస్ తెలిపారు.

కటాస్. బ్లాక్ బెల్ట్ విభాగంలో

ఎం, ముక్తిశ్రీ, బంగారు పథకం
కే వి మాన్యా చౌదరి వెండి పథకం

కలర్ బెల్స్ కటాస్ విభాగంలో

ఎం. గాయత్రి సాయి దివ్య బంగారు పథకం
కే. శ్రీహిత్ వెండి పతకం
బి , రాఖి బంగారు పతకం
కే , కృతిక బంగారు పతకం
కే. ఆశ్రిత్ వెండి పతకం
పీ. హార్దిక్ బంగారు పతకం
పీ. ధ్రువన్ వెండి పతకం

కుముతి బ్లాక్ బెల్ట్ విభాగంలో

ఎం. ముక్తిశ్రీ బంగారు పతకం
కే సాయి ప్రీతం చౌదరి వెండి పతకం .

కుముతీ కలర్ బెల్ట్స్ విభాగంలో

సీ హచ్. ప్రీతం , వెండి పతకం
సీ హచ్. ప్రణతి, కాంస్య పతకం

ఈ పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మరియు కోచ్ కరాటే శ్రీనివాస్ ను ఏసీపీ గిరి ప్రసాద్ మరియు గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు, మంథని సీఐ సతీష్ లు అభినందించారు. జపాన్ శిటర్యు కరాటే స్కూల్ ప్రెసిడెంట్ ఎం రమేష్, సీనియర్ ఇన్స్తెక్టర్స్
ఎస్ శ్రీనివాస్, k శ్రావణ్ కుమార్, నిదేష్ కుమార్ ,j శుభశ్రీ , నివేదన్ రెడ్డి, శివ కైలాస్ రెడ్డి స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ బాణేష్ రావు , స్పందన క్లబ్ సెక్రటరీ చిరంజీవి ఆదిత్య, వంశీ కృష్ణ , మరియు తల్లిదండ్రులు అభినందించారు.