మహా వెలుగు పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 20 : బిజెపి మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో
లక్ష్మి పురం ప్రాథమిక చికిత్స కేంద్రం , అల్లూరు ప్రాథమిక చికిత్స కేంద్రం ని సందర్శించి అక్కడ ఆరోగ్య పరిస్థితులతో పాటుగా మోడీ ప్రవేశ పెట్టిన వాక్సినేషన్ సంఖ్య TB పేషెంట్స్ సంఖ్య ను డాక్టర్స్ ని అడిగి తెలుసుకొని మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని TB రహిత సమాజం ఏర్పాటు చేసే దిశ గా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందేలా చేయాలని తెలిపారు. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్బంగా వాక్సినేషన్ ప్రజలు అందరికి ఉచితంగా ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియచేశారు .
ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక, సరస్వతి, స్వర్ణలత, లక్ష్మి, సాయిలత , హాస్పిటల్ స్టాఫ్, నర్స్,తదితరులు పాల్గొన్నారు.