- రామగుండం ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్
మహా వెలుగు రామగుండం సెప్టెంబర్ 20:- రాకేష్ నామని
ప్రాచీన యుద్ధ విద్య అకాడ అని ఆపదలో ఉన్నప్పుడు ఆత్మరక్షణగా అకాడ ఎంతగానో ఉపమెాగపడుతుందని రామగుండం ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ విశ్వభారతి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ అకాడ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్‌ను ఎంఎల్‌ఏ చందర్ ప్రారంభించి, విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎల్‌ఏ మాట్లాడుతూ… రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేక కళలకు నిలయంగా ఉందని, కళాకారులకు ఎల్లప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అండగా ఉంటారని అన్నారు.గోదావరిఖని ప్రాంతం అంటేనే అకాడకు పెట్టింది పేరని, నాడు అకాడతోనే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యేవని, అకాడలేని దసరా ఉత్సవాలే ఉండేవి కావన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, తాను అకాడ విన్యాసాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే వారమని గుర్తు చేసుకున్నారు. ప్రాచీన యుద్ధ విద్య అయిన అకాడకు పూర్వ వైభవం కల్పించడానికి అకాడ మాస్టర్లు కృషి చేయాలని కోరారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ హనుమాన్ అకాడ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఎంతో విద్యార్థినీ, విద్యార్థులు ఈ శిక్షణ పొంది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నారని అన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండంలో అకాడ అభివృధ్దికి ఎంతగానో కృషిచేశారని చందర్ తెలిపారు. సాంస్కృతిక సంప్రదాయాలు, కళల గురించి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. అకాడ శిక్షణతో పిల్లల్లో ఏకాగ్రతతో పాటు మనోధైర్యం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరు అకాడ శిక్షణను పొందాలన్నారు. అదేవిధంగా కేవలం దసరా సమయాల్లోనే కాకుండా ప్రతిరోజు పిల్లలకు అకాడ శిక్షణను ఇచ్చే విధంగా నిర్వాహకులు ప్రణాళికను ఏర్పాటు చేయాలని, అందుకు గాను సహాయసహాకారాలు తాను అందిస్తామన్నారు. కాగా, పిల్లల్లో చదువుతో పాటు ఇతర క్రీడల్లో రాణించే విధంగా పాఠశాల యాజమాన్యం కృషి చేయడం ఎంతో అభినందనీయమని, పిల్లలకు మంచి విద్యాబుద్దులతో పాటు వారిలో ప్రతిభను వెలికిస్తున్న విశ్వభారతి పాఠశాల యాజమాన్యానికి ఎంఎల్‌ఏ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మెన్ మామిడాల ప్రభాకర్ నాయకులు తోకల రమేష్, ఈదునూరి పర్వతాలు, ఈదునూరి శంకర్, కుమ్మరి శారద, వీరాలాల్, సత్తార్‌ఖాన్, సాగర్‌రావు, రాము, శంకర్‌గౌడ్, అకాడ బాధ్యులు కంది చంద్రయ్య, కంది నాగరాజు, పాఠశాల బాధ్యులు యాదగిరిగౌడ్ తదితరులు పాల్గోన్నారు.