అక్రమ సంబంధమే సూది మందు హత్య ..

  • సూది మందు హత్య కేసులో వీడిన మిస్టరీ

పోలీసులు అదుపులో సూత్రధారులు.. పాత్రధారులు…….

మహా వెలుగు ,ముదిగొండ, సెప్టెంబర్ 20 : అక్రమ సంబంధమే సూది మందు ఇవ్వడానికి కారణం అని తెలుస్తోంది. అయితే తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని వల్లబి గ్రామం వద్ద సూది మందు ఇచ్చి షేక్ జమాల్ ను హత్య చేసిన సంఘటన విదితమే

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా పోలిసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం చింతకాని మండలం నామవరం వద్ద ఓ అనుమానితుడడు అదుపులోకి తీసుకుటుండగా పరారీ అయినట్లు తెలిసింది. నామవరం కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనలో పాల్గొన్నట్లుగా పోలిసులు అనుమానిస్తున్నారు.
అక్రమ సంబందానికి అడ్డువస్తున్నాడనే కారణంతో సూది మందు ఇచ్చి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్వర్లు , మోహన్ రావు వీరిద్దరూ మత్కేపల్లి నామారం గ్రామస్తులుగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

వివాహేతర సంబంధంతోనే హత్య కు దారి తీసింది ప సూది పొడిచిన వాడు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం రూరల్ ఏసీపీ బసవ రెడ్డి సారధ్యంలో పోలీసులు కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.