మందమర్రి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

  • ఇద్దరి యువకులకు గాయలు

మహా వెలుగు , మంచిర్యాల 22 : మంచిర్యాల జిల్లా కేంద్రం లోని మందమర్రి హైవే రోడ్డు పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

మందమర్రి పట్టణానికి చెందిన చిలుక ప్రశాంత్, మేకల రాజ్ కుమార్ ద్విచక్ర వాహనం మీద మంచిర్యాల నుండి మందమర్రికి వైపునకు వస్తుండగా మార్గమధ్యంలో భారీ లారి వాహనం ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో మేకల ప్రశాంత్ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జుగా కాగా… మరొక యువకుని కి పాదం భారీ లారీ టైర్ల కిందపడి పాదం పూర్తిగా తెగి పోయింది . స్పందించిన మందమర్రి పోలీస్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని అదుపులో తీసుకొని బాధితులను చికిత్స నిమిత్తం 108 లో తరలించారు.