- తీసుకున్న పైసలు అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్న దళారులు
- భార్య పుస్తెలతాడు అమ్మి పైసలిచ్చినిన బాధితుడు
మహా వెలుగు రామగుండం సెప్టెంబర్ 26:- రిపోర్టర్ రాకేష్ నామని : గోదావరిఖనిలో మరో ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
తిలక్ నగర్ కు చెందిన శ్రీను అనే వ్యక్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య పుస్తెలతాడు అమ్మి ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగం కోసం ధరలకు. 8,20,000 డబ్బులు ఇచ్చానని లేఖలు పేర్కొన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లో పర్మినెంట్ జాబ్ అని చెప్పి దళారులు 8 లక్షల ఇరవై వేల రూపాయలు బాధితుని దగ్గర తీసుకున్నారు. పనిలో చేరిన నాలుగు నెలలకే ఉద్యోగం పోవడంతో మానసిక ఒత్తిడికి గురైన బాధితులు ఏ అధికారికి ఎవరికి చెప్పిన కూడా న్యాయం జరగకపోవడంతో ఈరోజు గోదావరి సమ్మక్క- సారలమ్మ గుడి వద్ద పత్తి మందు తాగి . ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం పోలీసులకు సమాచారం. అందించిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకొని బాధితులని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. ఆర్ ఎఫ్ సి ఎల్ నౌకరికుల ప్రాణాలు బలి తీసుకుంటుంది దిక్కు దోచని పరిస్థితిలో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం జరుగుతుందా అధికారులు దళారులకే సపోర్ట్ ఇస్తున్నారు అని బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.