మహా వెలుగు ,హైదరాబాద్ : CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
న్యాయవ్యవస్థతో పాటు రాజ్యాంగ సంస్థలకు బీజేపీ దుర్మార్గాలను, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాలను పంపిస్తాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీల అధ్యక్షులకు పంపించాం. భారతదేశం కొత్త పంథా పట్టాలి. ఇలాంటి దుర్మార్గాలను దేశం సహించదని చెప్పాలి. చాలా భయంకరమైన, హేయమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే. ఆషామాషీ వ్యవహారం కాదు. చిల్లరమల్లర రాజకీయం కాదు. ఒక్క ఎమ్మెల్యే లేని కాడ ఏక్ నాథ్ షిండేలను పెడుతామని చెప్తరు. ఇదేక్కడి రాజకీయం అని కేసీఆర్ ప్రశ్నించారు.